పోలీసుల అదుపులో వ్యభిచారం నిర్వహిస్తున్న తమిళ నటి
- June 03, 2018
చెన్నై: వ్యభిచారగృహాన్నినిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ప్రముఖ తమిళ సినీనటి సంగీత బాలన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని పనయూర్ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో సంగీత బాలన్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. రిసార్ట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది విటులు 'సహా పలువురు మహిళలను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. మహిళలంతా ఉత్తర భారతానికి చెందిన వారిగా గుర్తించి.. వారిని వ్యభిచారం గృహం నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. వ్యభిచారగృహ నిర్వహణలో సంగీతకు సహకరిస్తున్న సురేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిని మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టగా.. ధర్మాసనం ఇద్దరికి కస్టడీ విధించింది. సంగీత బాలన్ 1996లో వచ్చిన కరప్పురోజా సినిమాతో తమిళనాట తెరంగేట్రం చేసింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించింది.
వీటితోపాటు తమిళనాట మోస్ట్ పాపులర్ టీవీ సీరియల్‌గా రన్ అవుతున్న రాణీ-వాణీలో రాధికా శరత్ కుమార్‌తో కలిసి నటిస్తోంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







