అల్ అయిన్:మాల్‌ ఎస్కలేటర్‌పై పడి రెండేళ్ళ చిన్నారికి గాయాలు

- June 04, 2018 , by Maagulf
అల్ అయిన్:మాల్‌ ఎస్కలేటర్‌పై పడి రెండేళ్ళ చిన్నారికి గాయాలు

అల్ అయిన్:రెండేళ్ళ చిన్నారి షాపింగ్‌ అల్‌ అయిన్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో మొదటి ఫ్లోర్‌ నుంచి పడి, తీవ్ర గాయాల పాలయ్యాడు. తల్లిదండ్రులతో కలిసి ఎస్కలేటర్‌ మీద నుంచి వెళుతుండగా చిన్నారి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తలకు బలమైన గాయం తగిలింది. ఆ చిన్నారికి తక్షణం శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని షాపింగ్‌ సెంటర్‌ అధికార ప్రతినిథి వెల్లడించారు. నాన్‌ మెటాలిక్‌ బ్యారియర్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com