దుబాయ్:మహిళా క్లీనర్‌కి ఇంజనీర్ లైంగిక వేధింపులు
- June 04, 2018
దుబాయ్:39 ఏళ్ళ సిరియన్ ఇంజనీర్ ఒకరు, ఫిలిప్పినా మహిళను లైంగికంగా వేధించిన ఘటనలో కేసు నమోదయ్యింది. విచారణ జరుగుతోంది. మార్చి 27న ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ సంస్థలో క్లీనర్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ళ మహిళ, వినియోగదారుడి కోసం కూలర్ నుంచి నీళ్ళను నింపుతుండగా, అటువైపుగా వచ్చిన సిరియన్ ఇంజనీర్, ఆమెను అసభ్యకరంగా తాకాడు. గట్టిగా తనను కొట్టాడనీ, ఈ క్రమంలో బాధ తట్టుకోలేక తాను విలవిల్లాడుతూ అరిచానని బాధితురాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, విచారణ సందర్భంగా నిందితుడు, తనపై మోపబడ్డ అభియోగాల్లో నిజం లేదని అంటున్నాడు. తన పాత స్నేహితురాలు అనుకుని, తాను అలా చేశాననీ, ఇందులో లైంగిక వేధింపుల కోణం ఏమీ లేదని నిందితుడు తన వాదనను విన్పించాడు. ఈ కేసులో జూన్ 28న తీర్పు వెలువడనుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!