'పంతం' టీజర్ విడుదల

- June 05, 2018 , by Maagulf
'పంతం' టీజర్ విడుదల

మాచో హీరో గోపిచంద్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. కొన్నాళ్ళుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్ ప్రస్తుతం చక్రి దర్శకత్వంలో పంతం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో గోపిచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై భారీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. సీరియస్ లుక్‌తో కనిపిస్తున్న గోపించంద్ పోలీస్ గెటప్‌లో రఫ్ఫాడిస్తున్నాడు . పంతం అనే టైటిల్‌కి ఫర్ ఏ కాజ్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమాతో తప్పక సక్సెస్ సాధించాలనే కసితో గోపిచంద్ ఉన్నాడు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా... ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కెకె రాధామోహన్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. సామాజిక అంశాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. వచ్చే నెలలో సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com