మస్కట్‌:హత్య కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్‌

- June 05, 2018 , by Maagulf
మస్కట్‌:హత్య కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: ఇద్దరు వలసదారుల్ని ఓ హత్యకేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించడం జరిగింది. పోలీస్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బర్కాలో సహచరుడ్ని ఈ ఇద్దరు అనుమానితులు హత్య చేసినట్లు తెలియవస్తోంది. హతుడు, నిందితులు ఆసియా జాతీయులుగా గుర్తించారు పోలీసులు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ - సౌత్‌ బతినా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ - బార్కా పోలీస్‌ స్టేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ సంయుక్తంగా చేపట్టిన విచారణలో భాగంగా ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. హత్య అనంతరం నిందితులు, మృతుడ్ని దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com