మిడ్ డే బ్రేక్ టైమింగ్స్ ప్రకటించిన యూఏఈ
- June 05, 2018
యూఏఈ, సమ్మర్ మిడ్ డే బ్రేక్ పీరియడ్ మరియు టైమింగ్స్‌ని ప్రకటించింది. కార్మికులు, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్, ఔట్ ఆఫ్ ఆఫీస్ వర్కర్స్ ఎండ తీవ్రత కారణంగా ఆరోగ్య సమస్యలకు గురికాకుండా ఈ 'మిడ్ డే బ్రేక్' టైమింగ్స్ సమ్మర్‌లో ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి 15 సెప్టెంబర్ వరకు వుంటుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఈ బ్రేక్ పీరియడ్ అమల్లో వుంటుంది. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ నాజర్ బిన్ థని అల్ హామ్లి ఈ మేరకు డిక్రీ విడుదల చేశారు. వర్కింగ్ అవర్స్ రెండు షిఫ్టులుగా విభజిస్తారు. మొత్తం 8 వర్కింగ్ అవర్స్ వుంటాయి. వర్కింగ్ అవర్స్‌ని మించి కార్మికుడితో పని చేయించుకుంటే, 25 శాతానికి తక్కువ కాకుండా వేతనాన్ని అదనంగా చెల్లించాల్సి వుంటుంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు ఝాము 4 గంటల వరకు పనిచేయిస్తే 50 శాతం తక్కువ కాకుండా వేతనం చెల్లించాలి. మిడ్ డే బ్రేక్ సందర్భంగా యజమాని, కార్మికులకు రెస్ట్ సౌకర్యం కల్పించాలి. మిడ్ డే బ్రేక్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..