ఆర్.జి.వి కటౌట్ కు పాలాభిషేకం ..

- June 05, 2018 , by Maagulf
ఆర్.జి.వి కటౌట్ కు పాలాభిషేకం ..

సాధారణంగా ఏ హీరో అభిమానులైన , తమ హీరోకు ప్లాప్ సినిమా ఇస్తే ఆ డైరెక్టర్ ఫై నెగిటివ్ కామెంట్స్ చేయడం లేదా..తిట్టడం వంటివి చేస్తారు. కానీ నాగార్జున అభిమానులైతే ఆ డైరెక్టర్ కటౌట్ కు పాలాభిషేకం చేసి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే తెలిసి ఉంటుంది.

అవును రామ్ గోపాల్ వర్మనే. నాగ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గా మొన్నటి వరకు ప్రేమించిన అభిమానులు , ఇప్పుడు ఈయన పేరు చెపితేనే మండిపోవడమే కాదు కనిపిస్తే కొట్టేంత కోపం తో ఉన్నారు. నాగ్ కెరియర్ లోనే చెత్త సినిమా తీశారంటూ ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు.

ఇక వర్మ గారు మీ కలలో కూడా నాగ్ తో సినిమా చేయకండి అంటూ ఓ వినూత్న తరహాలో వారి నిరసన తెలిపారు. వర్మ కటౌట్ కు పాలాభిషేకం చేసి మరెప్పుడు నాగ్ తో సినిమా చేయకండి అంటూ ప్రాధేయపడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com