తక్కువ ఖర్చుతో డి టెక్నాలజీ సినిమా..!

- June 05, 2018 , by Maagulf
తక్కువ ఖర్చుతో డి టెక్నాలజీ సినిమా..!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యూబ్‌, యుఎఫ్‌ఓ విధానం నిర్మాతలకు భారంగా మారింది. ఈ ఖర్చు తగ్గించేందుకు హాలీవుడ్‌లో ఉపయోగిస్తున్న డి సినిమా టెక్నాలజీని డిజిక్వెస్ట్‌ సంస్థ రూపొందించింది. ఈ కొత్తతరహా పరిజ్ఞానంలో 2కె, 4కె, 8కె హై క్వాలిటీ వస్తుంది. దీనికోసం ప్రస్తుతం ఉన్న ప్రొజెక్షన్‌ ప్రత్యేకంగా డెవలప్‌ చేస్తారు. ఎన్నో అదనపు సౌకర్యాలు ఉన్న డి సినిమా టెక్నాలజీ వల్ల నిర్మాతలకు ఖర్చు తగ్గడమే కాకుండా క్వాలిటీతో ప్రేక్షకులు సినిమా చూసే ఆవకాశం కలుగుతుంది. ఈ టెక్నాలజీలో మరో సౌకర్యం ఏమిటంటే పైరసి జరిగినట్టయితే ఎక్కడ జరిగిందనేది నిమిషాల వ్యవధిలో తెలుసుకోవచ్చు.

డి సినిమాకు సంబంధించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ తెలంగాణ ఎఫ్‌డిసి కార్యాలయంలో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది ఈ తరహా డిస్ట్రిబ్యూషన్‌ కోసం కావలసిన ఫార్మెటు. డి సినిమా మాస్టరింగ్‌ను నిర్మాతల మండలి, పంపిణీదారుల విభాగాల ఉమ్మడి సహకారంతో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ద్వారా డిజిక్వెస్ట్‌ సహకారంతో ప్రారంభించాలని ఈ సందర్భంగా ఎఫ్‌డిసి చైర్మన్‌ పి.రామమోహనరావు సినీ ప్రముఖులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన నిర్మాతలు కెఎల్‌. నారాయణ, సి.కల్యాణ్‌, విజయేంద్రరెడ్డి, దామోదరప్రసాద్‌, రాందాసు, వల్లూరిపల్లి రమేష్‌, పిఎల్‌కె.రెడ్డి, బాలగోందరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com