2018 ఫిలిం ఫేర్ అవార్డులకు పోటీ పడుతున్న చిత్రాల వివరాలు!
- June 06, 2018
ప్రపంచలో ఏదైని చిత్రం రిలీజ్ అయితే..పాజిటీవ్ టాక్ వస్తే..ఆ సినిమాకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అవార్డులు వస్తే..ఆ చిత్ర యూనిట్ కి ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేం. జూన్ 16న 65వ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకు జరగబోతున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఫిలిఫేర్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు.
ఈ సంవత్సరం ఈ అవార్డుల ప్రధానోత్సవం ఎంతో ప్రత్యేకత ఉండబోతుంట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150, బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలే కాదు రాజమౌళి నటించిన బాహుబలి 2 కూడా పోటీలో ఉండబోతుంది. అంతే కాదు యంగ్ హీరోల చిత్రాలు కూడా ఈ పోటీలో ఉండబోతున్నాయట. తెలుగు నుండి ఫిలిం ఫేర్ అవార్డులకు పోటీపడుతున్న చిత్రాల లిస్ట్ పై ఓ లుక్కు వేయండి.
ఉత్తమ కథానాయకుడి కేటగిరి లో :
1) చిరంజీవి ( ఖైదీనెంబర్ 150)
2) బాలకృష్ణ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
3) ప్రభాస్ ( బాహుబలి 2)
4) ఎన్టీఆర్ ( జై లవకుశ )
5) విజయ్ దేవరకొండ ( అర్జున్ రెడ్డి )
ఉత్తమ చిత్రం కేటగిరీ లో :
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) ఫిదా
3) శతమానం భవతి
4) అర్జున్ రెడ్డి
5) బాహుబలి 2
ఉత్తమ దర్శకుల కేటగిరీ లో :
1) క్రిష్ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
2) ఎస్ ఎస్ రాజమౌళి ( బాహుబలి 2)
3) సందీప్ రెడ్డి వంగా ( అర్జున్ రెడ్డి )
4) శేఖర్ కమ్ముల ( ఫిదా )
5) సంకల్ప్ రెడ్డి ( ఘాజి )
6) సతీష్ వేగేశ్న ( శతమానం భవతి )
ఉత్తమ కథానాయకి కేటగిరి లో :
1) అనుష్క ( బాహుబలి 2)
2) రితిక సింగ్ ( గురు )
3) నివేదా థామస్ ( నిన్ను కోరి )
4) సాయి పల్లవి ( ఫిదా )
5) రకుల్ ప్రీత్ సింగ్ ( రారండోయ్ వేడుక చూద్దాం )
వీటితో పాటుగా పలువురు కేటగిరి లలో కూడా అవార్డులు ఇవ్వనున్నారు . అయితే ఉత్తమ కథానాయకుడు ఎవరు ? ఉత్తమ చిత్రం ఏది ? అన్న దాంట్లో మాత్రం కాస్త టెన్షన్ నెలకొన్నది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..