జాహ్నవీపై అర్జున్ సీరియస్...

- June 06, 2018 , by Maagulf
జాహ్నవీపై అర్జున్ సీరియస్...

ఇద్దరికీ అమ్మలు వేరైనా నాన్న ఒక్కరే. అమ్మ ఉంటే బిడ్డల్ని ఓ కంట కనిపెడుతూ, ఎవరి నీడా పడకుండా బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఎవరికీ అవకాశం ఇవ్వకుండా చూసుకుంటుంది. మరి ఇప్పుడు అమ్మలేదు. ఆ లోటు భర్తీ చేయడానికి చెల్లెళ్ల బాధ్యతల్ని అన్న అర్జున్ కపూర్ భుజానికి ఎత్తుకున్నాడు. జాహ్నవీ, ఖుషీలను ఎవరైనా ఓ మాట అంటే వారిపై విరుచుకుపడుతున్నాడు. మొన్నటికి మొన్న జాహ్నవి చిట్టి పొట్టి డ్రస్ వేసుకుని కెమేరాకు చిక్కితే ఓ ప్రముఖ పత్రికలో ప్యాంటు వేసుకోవడం మరచి పోయిన జాహ్నవి అంటూ రాసుకొచ్చారు. దానికి అర్జున్ ఘాటుగానే స్పందించాడు. జనాలకి లేని ఆలోచనలను మీరే కల్పిస్తున్నారు. నిజానికి ఈ డ్రెస్‌లో జాహ్నవి చాలా బావుంది అంటూ చెల్లెల్ని వెనకేసుకు వచ్చాడు. ఏదేమైనా చెల్లెళ్లకు అండగా నిలుస్తున్న అర్జున్ కపూర్‌ని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com