మస్కట్‌లో కొత్త బస్ రూట్ ప్రారంభించనున్న మవసలాట్
- June 06, 2018
మస్కట్: మవసలాట్ త్వరలో అల్ అజాబియా - బౌషర్ రూట్ (12 బి)ని మస్కట్ గవర్నరేట్‌లో ప్రారంభించనుంది. శుక్రవారం ఈ రూట్ ప్రారంభమవుతుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని మరింతగా విస్తరించే క్రమంలో ఈ రూట్‌ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్ని ఈ రూట్ కవర్ చేస్తుంది. కాలేజీలు, హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈ రూట్‌లో కవర్ అవుతాయి. అల్ అజైబియా స్టేషన్ నుండి ప్రారంభమై - అల్ అజైబియా బ్రిడ్స్, సుల్తాన్ కబూస్ గ్రాండ్ మాస్క్, రాయల్ హాస్పిటల్, సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, బౌషర్ పెడెస్ట్రియన్ బిడ్జి, కాలేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్, మోడ్రన్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్, ఒమన్ మెడికల్ కాలేజ్, మస్కట్ ప్రైవేట్ హాస్పిటల్, మస్కట్ కాలేజ్ మీదుగా బౌషెర్ చేరుకుంటుంది ఈ బస్ రూట్. రిటర్న్ జర్నీలోనూ ఇదే రూట్‌లో బస్ ప్రయాణిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి ప్రతి 30 నిమిషాలకు ఓ బస్ వుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!