బ్రిటన్‌:గురుద్వారా, మసీదుకు నిప్పు

- June 06, 2018 , by Maagulf
బ్రిటన్‌:గురుద్వారా, మసీదుకు నిప్పు

లండన్‌, జూన్‌ 6: బ్రిటన్‌లో ప్రార్థనా మందిరాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. లీడ్స్‌ జిల్లాలోని బీస్టన్‌ పట్టణంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవాము జామున సుమారు 4 గంటల సమయంలో జామియా మసీదుతోపాటు ఓ గురుద్వారాను తగులబెట్టారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటనలు జరిగాయి. స్థానికులు ఈ మంటలను గమనించి అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... వాటిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఈ దుశ్చర్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్వేష భావంతోనే ప్రార్థనా మందిరాలకు నిప్పు పెట్టి ఉంటారని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com