సింగపూర్: సెంటోసా ఐలాండ్ లో ట్రంప్, కిమ్ భేటీ
- June 06, 2018
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల సమావేశా నికి సంబంధించి మరింత స్పష్టత వచ్చింది. ఈనెల 12న సింగపూర్ లోని సెంటోజా ద్వీపంలో వీరిద్దరి సమావేశం ఉంటుందని వైట్‌హౌస్ పేర్కొంది. సెంటోజా ద్వీపంలోని విలాసవంతమైన కపెల్లా హోటల్‌లో ట్రంప్, కిమ్ సమావేశమ వుతారని అధ్యక్ష కార్యాలయం మీడియా ప్రతినిధి సారా సాండర్స్ ట్విటర్ ద్వారా తెలిపారు. 'ఉత్తర కొరియా తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కానున్నాయి. సమావేశా నికి ముందు మరింతగా సంప్రదిం పులు జరుగుతున్నాయి. ఇది ఎంతో ముఖ్యమైన సందర్భం. ఆ రెండు రోజులు చాలా విలువైనవి' అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీడియా ప్రతినిధులతో తన భావాలను పంచుకున్నారు.
సెంటోజా ఎందుకు?
సింగపూర్‌లో చాలా కీలకంగా భావించే ప్రధాన దీవికి సెంటోజా చాలా దగ్గర్లో ఉండటం వల్ల భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. కేబుల్ కార్లు, మోనోరైల్, భూగర్భ రహదారులు వంటి వాటితో సురక్షిత మైన రవాణా మార్గాలు న్నాయి. సింగపూర్ కొన్ని దీవుల కలయిక. ఇందులోని 63 దీవుల్లో సెం టోజా ఒకటి. దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ద్వీపంలో ఖరీదైన రిసార్టులు, విలాస వంతమైన యాచెట్స్, కాసినోలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో సముద్ర వర్తకానికి సింగపూర్ ప్రధాన కేంద్రంగా నిలిచింది. భారత్, చైనా మధ్య ఉండటం ఆ దేశానికి బాగా కలి సొచ్చింది. బ్రిటిష్ పాలనకు ముందు కూడా సింగపూర్ వాణిజ్య కేంద్రంగా విరాజిల్లేది. ఇదే సమయంలో సముద్రపు దొంగల బెడద కూడా పెరిగింది. ఆ రోజుల్లో సెంటోజా సముద్రపు దొంగలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ జరిగే మారణకాండతో 'మృత్యు ద్వీపం'గా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మలై, చైనీస్, బెగిస్ తెగలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తుంటారు.
సింగపూర్ గగనతలంపై ఆంక్షలు
ట్రంప్, కిమ్ భేటీ నేపథ్యంలో సింగపూర్‌లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. అంతేగాకుండా, సింగపూర్ గగనతలంలో కొన్ని ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన నోటీసును ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో), యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తమ వెబ్‌సైట్లో ఉంచాయి. జూన్ 11, 12, 13 తేదీల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ సమయంలో సింగపూర్ ఛాంగీ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలు తమ వేగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంతేగాకుండా, భద్రతా కారణాల దృష్ట్యా రన్‌వేపై కూడా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..