దుబాయ్ స్కూల్స్ ఫీజుల్లో పెంపు లేదు: షేక్ హందాన్
- June 06, 2018
దుబాయ్:ఈ ఏడాది దుబాయ్ స్కూల్స్‌లో ఫీజుల పెంపు లేదని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ రషీద్ అల్ మక్తౌమ్ చెప్పారు. ట్విట్టర్లో ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో, స్కూల్ ఫీజులను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారాయన. దుబాయ్‌లోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఈ ఆదేశాన్ని పాటించాల్సి వుంటుంది. ఫీజుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని షేక్ హమదాన్ వివరించారు. దుబాయ్‌లో పలు స్కూల్స్ భారీగా ఫీజుల్ని వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూల్స్ ఒక్కో విద్యార్థి నుంచి 100,000 దిర్హామ్‌లను వసూలు చేస్తున్నాయి. పుస్తకాలు కాకుండా తమకు 23,000 దిర్హామ్‌ల ఖర్చవుతోందంటూ ఇద్దరు పిల్లల తల్లి అర్చినా దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు పెంచకూడదన్న పాలకుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..