రియాద్‌లో జిసిసి సమ్మిట్ ప్రారంభం
- December 09, 2015
గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ లీడర్స్ సౌదీ రాజధాని రియాద్ చేరుకున్నారు. 36వ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సమ్మిట్ కోసం జిసిసి దేశాలకు చెందిన ప్రముఖ నేతలు రియాద్‌కి వచ్చారు. ఈ సమ్మిట్‌లో గల్ఫ్ దేశాల మధ్య ఐక్యత మరింత పెరగడానికి తగిన సూచనలు, సలహాల్ని నేతలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. అలాగే సిరియా, యెమెన్‌లోని సంక్షోభం గురించి కూడా చర్చిస్తారు. ఆయా దేశాల్లోని పరిస్థితులపై చర్చించి, అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి తగిన చర్యలను కూడా గుర్తిస్తారు ఈ సమ్మిట్‌లో జిసిసి నాయకులు. తీవ్రవాద స్థావరాలపై సంయుక్తంగా దాడులు చేయడం, తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలకు రక్షణ కల్పించడం, తగిన వైద్య సహాయం అందించడం వంటివి ముఖ్య అంశాలుగా జిసిసి సమ్మిట్‌లో చర్చకు రానున్నాయి. అలాగే, అభివృద్ధిలో గల్ఫ్ దేశాలు శరవేగంగా ముందుకు వెళ్ళడానికి పరస్పర సహకారం అందించుకోవడమెలా? అన్నదానిపైన కూడా నాయకులు చర్చిస్తారు.
తాజా వార్తలు
- గూగుల్ మ్యాప్స్‌లో కొత్త అప్డేట్..
- కువైట్‌లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!
- భారతీయ నావికులను పరామర్శించిన దుబాయ్ భారత కాన్సులేట్ అధికారులు..!!
- కువైట్ సహా నాలుగు దేశాల్లో భారత కాన్సులర్ సేవలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.!!
- దుబాయ్‌లో కొత్త రికార్డు.. ఎమిరేట్స్ హిల్స్‌లో విల్లాకు Dh17 మిలియన్ల అద్దె..!!
- ఖతార్‌లో తీవ్రమైన ఎండలు, తేమ.. వాతావరణ శాఖ వెల్లడి..!!
- నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్







