మలేషియాలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం...

- June 08, 2018 , by Maagulf
మలేషియాలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం...

మలేషియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల పేరిట నిరుద్యోగులు నిలువునా మోసపోయారు. 17 మంది యువకులకు నకిలీ వీసాలు, టిక్కెట్లు పంపించి రూ.13.60 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు గురువారం బాధితులు చేరుకుని బోరుమన్నారు. ఈ సంఘట న పలాస–కాశీబుగ్గ పట్టణాల్లో కలకలం రేపింది.

పలాస–కాశీబుగ్గ పట్టణానికి చెందిన రాజ్‌కుమార్‌ మలేషియాలో ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడే వెల్డర్‌గా పని చేస్తున్న కార్తీక్‌తో కలిసి నిరుద్యోగులకు గాలం వేశా రు. ఇందులో భాగంగా పలాసలో ఉంటున్న రాజ్‌కుమార్‌ తమ్ముడు గజపతి సహకారంతో మలేషి యాలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మబలి కారు. ఇతడు మెడికల్, ఇతర దొంగ సర్టిఫికెట్ల తయారీలో దిట్ట.

ఈ మేరకు గత నెల 15న టిక్కెట్లు ఇస్తున్నామని నకిలీ వీసా, విమాన టిక్కెట్లు వాట్సాప్, మెయిల్‌లో పంపించి ఒక్కొక్క రి నుంచి రూ. 80 వేల చొప్పున వసూలు చేశారు. అదే తేదీన తీరా టిక్కెట్లు పనిచేయడంలేదని నచ్చచెప్పి చెన్నై విమానాశ్రయం నుంచి వెనక్కి రప్పిం చేశారు. అనంతరం ఈ నెల 3వ తేదీన టిక్కెట్లు ఇస్తామని నమ్మబలికి మరలా డూప్లికేట్‌ వీసాలు, టిక్కెట్లు పంపారు. దీంతో కోపోద్రిక్తులైన బాధితులు పలాసలో రాజ్‌కుమార్, కార్తీక్‌ ఇళ్లకు గురువారం చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com