50 డేస్ ఓవర్ పూర్తి చేసిన భారత్ అనే నేను

- June 08, 2018 , by Maagulf
50 డేస్ ఓవర్ పూర్తి చేసిన భారత్ అనే నేను

భరత్ అను నేను.. అంతఃకరణశుద్దితో ప్రమాణం స్వీకారం చేస్తున్నాను అని అంటూ మహేష్ అసెంబ్లీలో చేసిన వాగ్థానం ఇంకా మనచెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. కలెక్షన్‌లలో కూడా భరత్ రికార్డు బ్రేక్ చేశాడు. బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టాడు. మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అను నేను ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ 50 రోజుల పోస్టర్‌ను విడుదల చేసింది. మహేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలనదించిన కొరటాల అసజయమన్నది లేకుండా హిట్‌లవైపు దూసుకెళుతున్నాడు. ఇప్పడు ఈ లిస్ట్‌లో భరత్ కూడా వచ్చి చేరింది. సామాజిక, రాజకీయ అంశాలను మేళ విస్తూ, దానికి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జత చేస్తూ కొరటాల కథను తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు నిరాజనాలు పట్టారు. భరత్‌ని సక్సెస్ చేశారు. అందుకే భరత్ అను నేను.. సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com