తెలుగు దర్శకునితో ధనుష్ సినిమా..

- June 08, 2018 , by Maagulf
తెలుగు దర్శకునితో ధనుష్ సినిమా..

సినిమా తోందరగా పూర్తి చేయడంలో అందరి కంటే ముందు వరసలో ఉంటారు ధనుష్. ఏకకాలంలో మల్టీఫుల్‌ సినిమాలు చేయడం ధనుష్‌కి కొత్తేమి కాదుహిట్లతో ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా  ఏడాది రెండు మూడు సినిమాలైన విడుదల అయే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఒక నటనలోనే కాదు  సింగర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను తెలుగు దర్శకులపై పడింది. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ధనుష్‌ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.ప్రవీణ్‌.. గరుడవేగ,చందమామ కథలు వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.  ప్రవీణ్‌ సత్తార్‌ చెప్పిన కథకు ధనుష్‌కు నచ్చడంతో అతనితో సినిమా చేయడానికి సుముఖత వ్యక్తం చేశారని టాక్‌. ఇందులో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com