బహ్రెయిన్:ఫుట్‌ బాల్‌ స్టేడియంకి శంకుస్థాపన

- June 08, 2018 , by Maagulf
బహ్రెయిన్:ఫుట్‌ బాల్‌ స్టేడియంకి శంకుస్థాపన

బహ్రెయిన్:యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఎఫైర్స్‌ మినిస్ట్రీ, కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా డైరెక్టివ్స్‌ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ స్టేడియం శంకుస్థాపన చేపట్టింది. యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ హిషామ్‌ అల్‌ జౌదార్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్‌ అల్‌ హస్సామ్‌ క్లబ్‌ కోసం ఈ స్టేడియంని ఏర్పాటు చేస్తున్నారు. బహ్రెయిన్‌లో ఫుట్‌బాల్‌ క్రీడకు మరింత వన్నె తెచ్చే దిశగా ఈ ఫుట్‌బాల్‌ స్టేడియం ఉపయోగపడ్తుందని అల్‌ జౌదార్‌ అభిప్రాయపడ్డారు. బహ్రెయిన్‌ యువతకు స్పోర్ట్స్‌ రంగంలో చేయూతనందించేందుకు కింగ్‌ హమాద్‌ తీసుకుంటున్న చొరవను అద్భుతమని ఎంపీ బు మజీద్‌ కొనియాడారు. ఉమ్‌ అల్‌ హస్సామ్‌ క్లబ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ హిషామ్‌ అబ్దుల్‌రహ్మాన్‌ అల్‌ బినాలి మాట్లాడుతూ, ఫుట్‌బాల్‌ స్టేడియం శంకుస్థాపనకు రావడం ద్వారా నేషనల్‌ క్లబ్స్‌కి ఆయన మద్దతు స్పష్టమయ్యిందని అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com