'శ్రీశ్రీ' తో మరోసారి తెరకెక్కుతున్న కృష్ణ, విజయనిర్మల దంపతులు.!

- December 09, 2015 , by Maagulf
'శ్రీశ్రీ' తో మరోసారి తెరకెక్కుతున్న కృష్ణ, విజయనిర్మల దంపతులు.!

 అలనాటి సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన సతీమణి విజయ నిర్మల జంటగా మరోసారి తమ నటనతో వెండితెరపై ప్రేక్షకులని ఆకట్టుకోనున్నారు. చాలాకాలం విరామం తరువాత వీరిద్దరూ కలిసి ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీశ్రీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణ, విజయ నిర్మలతోపాటు నటుడు నరేశ్‌, దర్శకుడు ముప్పలనేని శివ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com