చెవి నొప్పిని నివారించే హోం రెమెడీస్..
- December 09, 2015
నుంచుంటే నరకం...! కూర్చుంటే నరకం! ఎవరితో మాట్లాడాలన్నా విసుగు! ఏ చిన్న శబ్దం విన్నా చికాకు! చెవిలో బస్సులు, రైళ్ళు పరిగెడుతున్నట్లు, అర్థంకాని పాప్ మ్యూజిక్కు లయబద్దంగా ఎవరో డాన్స్ చేస్తున్నట్లు, నాటు బాంబులు పేలుతున్నట్లు... ఏదో తెలియని ప్రళయ ఘోష! వెరసి చూస్తే అది కచ్చితంగా చెవినొప్పి ప్రభావమే! వెలుపలి చెవి, మధ్యచెవి, లోపలి చెవిగా ఉండే చెవి భాగాలలో ఏ భాగం లో చిన్నలోపం ఏర్పడినా వెంటనే మనకు అందే ప్రాథమిక హెచ్చరిక చెవి నొప్పి! చెవి ఇన్ ఫెక్షన్ నివారణకి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అంతే కాదు సీజన్ బట్టి కూడా చెవినొప్పి వస్తుంటుంది. ముఖ్యంగా వింటర్ సీజన్ లో చెవినొప్పి రావడం మాత్రమే కాదు, నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. చాలా సార్లు, చెవిలో ఏదో ద్రవం ఉత్పత్తి అయినట్లు అగుపిస్తుంటుంది . అయితే కొంత మందిలో దంతసమస్యల వల్ల, సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల, థ్రోట్ ఇన్ఫెక్షన్, చెవి ఇన్ఫెక్షన్, చెవిలో గుమిలి, టాన్సిలైటిస్, కామన్ కోల్డ్, కొన్ని ప్రత్యేకమైన అలర్జీలు, దంతాల ఇన్ఫెక్షన్స్, ఆర్థరైటిస్, మరియు పళ్ళు కొరకడం వల్ల కూడా చెవినొప్పికి కారణం కావచ్చు. మీ చెవిని శుభ్రం చేయడానికి సమర్థవంతమైన చిట్కాలు చెవినొప్పి కొన్ని సందర్బాల్లో తట్టుకోలేని, భరించలేని విధంగా ఉంటుంది. చెవినొప్పి రెండు చెవులకు ఉండవచ్చు. కానీ, చాలా వరకూ ఒక చెవి మాత్రమే ఎక్కువగా నొప్పి కలిగి ఉంటుంది. చెవినొప్పి ఏవిధంగా వచ్చినా.. ఎలాంటి నొప్పి అయినా కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ తో సులభంగా తగ్గించుకోవచ్చు. చెవినొప్పి పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఏర్పడుతుంటాయి. చెవినొప్పికి ఎలాంటి యాంటీబయోటిక్స్ వాడకుండానే, హోం రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు.. మరి చెవి నొప్పిని నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం... చెవినొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో ఆలివ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది లూబ్రికాంట్ గా పనిచేస్తుంది. ఇది చెవిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తగ్గిస్తుంది. అందుకు రెండు మూడు చుక్కల గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ ను చెవిలోపల వదలడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిలో అనాల్జిక్ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చెవిలో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే చెవినొప్పిని నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి, రసాన్ని చెవిలో రెండు మూడు చుక్కల వదలడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మరియు వెల్లుల్లి రెబ్బలను ఆముదంలో వేసి, గోరువెచ్చగా చేసి రెండు మూడు చుక్కలను చెవిలో వేసుకోవాలి. చెవి నొప్పిని నివారించే ఒక పురాత హోం రెమెడీ ఇది . ఉల్లిపాయలో ఉండే యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చెవి నొప్పి నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని తీసి, రెండు మూడు చుక్కలు చెవిలో వదలడం వల్ల చెవి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . చెవి ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుంది . మరియు ఇది నేచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. అల్లం నుండి రసాన్ని తీసి రెండు మూడు చుక్కల రసాన్ని నొప్పి ఉన్న చెవిలో వేయడం వల్ల నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. తులసి ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిక్ మరియు యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నొప్పిని నివారిస్తాయి. రెండు మూడు తులసి ఆకులను తీసుకొని, పేస్ట్ లా చేసి, రసాన్ని నొప్పి ఉన్న చెవిలో పిండాలి. తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మంచి ఫలితం కోసం రోజుకు మూడు సార్లు చేస్తుండాలి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. మరియు నొప్పిని తగ్గిస్తుంది . వేపాకు రసాన్ని రెండు మూడు చుక్కలు చెవిలోపల వదలడం వల్ల చెవినొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా చెవినొప్పి జలుబు వల్లే ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్లో జలుబు వ్యాధినిరోధకతను ఎదుర్కొనే విటమిన్ ఎ, సి, ఇ ఆహారాలను తీసుకోవాలి. శరీరంలో నొప్పుల నివారణకు చాలా మంది ఐస్ ప్యాక్ లేదా వార్మ్ కంప్రెసర్(వేడికాపాడం)పడుతుంటా
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









