సౌదీ అరేబియా:చిన్నారులతోనూ డ్రగ్స్ స్మగ్లింగ్
- June 10, 2018
తబుక్: సీనియర్ కస్టమ్స్ అధికారి ఒకరు, డ్రగ్స్ స్మగ్లింగ్‌లో అక్రమార్కులు చిత్ర విచిత్రమైన, దురదృష్టకరమైన మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు వివరించారు. చిన్న పిల్లల్ని సైతం డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం వినియోగిస్తుండడం బాధాకరమని ఆ అధికారి తెలిపారు. హాలాత్ కస్టమ్స్ కంట్రోల్ డైరెక్టర్ అమ్మర్ ఖాలిద్ అల్ రిమైహ్ మాట్లాడుతూ, ఆఖరికి ఖురాన్‌ని సైతం డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఫుడ్ ప్యాకెట్స్‌లో డ్రగ్స్ వుంచుతున్నారనీ, ఖురాన్‌లలోనూ వీటిని వుంచుతున్నారనీ, అయితే డ్రగ్స్ స్మగ్లర్స్ ఎన్ని మార్గాల్లో స్మగ్లింగ్ చేయాలనుకున్నా, తమ డిపార్ట్‌మెంట్ అత్యంత సమర్థవంతంగా స్మగ్లింగ్‌ని అరికడుతోందని వివరించారు కస్టమ్స్ అధికారి. హజ్, ఉమ్రా సీజన్‌లో మరింతగా డ్రగ్స్ స్మగ్లింగ్ పెరుగుతున్నప్పటికీ, దాన్ని అరికట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పారు ఆ అధికారి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..