చెల్లీ.. క్షమించు: జాన్వీతో అర్జున్ కపూర్

- June 11, 2018 , by Maagulf
చెల్లీ.. క్షమించు: జాన్వీతో అర్జున్ కపూర్

శ్రీదేవి ఉన్నప్పుడు లేని బంధం.. ఆమె దూరమైన తరువాత ఆ అన్నా చెల్లెళ్లను కలిపింది. అన్నింటా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ బాధ్యతగల అన్నగా మసలుకుంటున్నాడు అర్జున్ కపూర్. సోమవారం జూన్ 11న జాన్వీ నటించిన మొదటి సినిమా ధడక్ ట్రైలర్ రిలీజ్ అయింది. చెల్లెలి ఫస్ట్ మూవీ అంటే అన్న తప్పనిసరిగా రావాలనుకున్నాడు. కానీ తను కూడా హీరో కావడంతో షూటింగ్‌లో బిజీగా ఉండాల్సి వచ్చింది. దాంతో.. తాను రాలేకపోతున్నానని అందుకు క్షమించమంటూ అర్జున్ చెల్లి జాన్వీకి ఓ పోస్ట్ పెట్టాడు. ఫంక్షన్‌కి తాను హాజరు కాలేకపోతున్నానని రాస్తూ, ఈ ఫీల్డ్‌లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి, ఎత్తుపల్లాలుంటాయి, ఎన్నింటినో ఎదుర్కోవాలి. అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు పోవాలి. స్వీకరించిన వృత్తిని ఎంజాయ్ చేయాలి. అప్పుడే పైకి వస్తావు. అని చెల్లెలికి ధైర్యం చెబుతూ ఈ ఫీల్డ్‌లో ఉండే కష్టనష్టాల గురించి, సాధకబాధల గురించి అన్న హింట్ ఇచ్చాడు. జాన్వీ నటించిన ధడక్ త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com