ఈద్ అల్ ఫితర్ సెలవు: దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్
- June 11, 2018
దుబాయ్:దుబాయ్ రెసిడెంట్స్, ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. అలాగే దుబాయ్ మెట్రో పొడిగించిన సేవల్నీ ఆస్వాదించే వీలు కలగనుంది. మల్టీ లెవల్ పార్కింగ్ టెర్మినల్స్ మినహా అన్ని పబ్లిక్ కార్ పార్క్స్‌లోనూ పార్కింగ్ సౌకర్యం ఉచితమే. 29 రమదాన్ నుంచి 3 షవ్వాల్ వరకు ఈ ఉచిత పార్కింగ్ వర్తిస్తుంది. 4 షవ్వాల్ నుంచి తిరిగి పార్కింగ్ రుసుములు మొదలవుతాయి. జూన్ 14, గురువారం నుంచి పొడిగించిన వేళల్లో మెట్రో రైళ్ళు సేవలందిస్తాయి. జూన్ 1న ఉదయం 5 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్ళు నడుస్తాయి. శుక్రవారం జూన్ 15న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు నడుస్తాయి. శనివారం, ఆదివారం, సోమవారం తెల్లవారు ఝామున 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్ళు నడుస్తాయి. దుబాయ్ ట్రామ్ సర్వీసులు గురువారం నుంచి గురువారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు నడుస్తాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు నడుస్తుంది. కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ 29 రమదాన్ నుంచి 3 షవ్వాల్ వరకు మూసివేయబడ్తాయి. 4 షవ్వాల్ రోజున తిరిగి తెరుస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..