బహ్రెయిన్:మానవత్వాన్ని చాటిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్
- June 11, 2018
బహ్రెయిన్:ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్ధిక సహాయం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు ఇటీవల బహ్రెయిన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందారు. వీరిలో ఒక్కరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన ఎర్రం శంకర్ (35). ఇతను బహ్రెయిన్ లో గుండెపోటుతో మృతిచెందాడు. మరొకరు బోధన్ మండలం తట్టుకోట్ కి చెందిన కల్లా విజయ్ (28 ). విజయ్ బహ్రెయిన్ లో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. పెళ్లి కాలేదు. పెద్ద దిక్కును కోల్పోయిన ఇద్దరు యువకుల కుటుంబసభ్యులను ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం అందించింది. ఈ మేరకు మృతులు శంకర్ భార్య పుష్ఫ, విజయ్ తండ్రి పోశెట్టి బ్యాంకు ఖాతాలకు నగదును పంపించారు. ఎర్రం శంకర్ సోదరుడు కూడా బహ్రెయిన్ లో ఉన్నాడు. మృతుడికి తల్లి, తండ్రి, భార్యతో పాటు ఐదు సంవత్సరాల పాప వుంది. తమ వంతు బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేవిధంగా కృషిచేస్తామని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన ఉపాధ్యక్షుడు వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రాజేంధార్, రవిపటేల్, గంగాధర్, జాయింట్ సెక్రెటరీలు విజయ్, దేవన్న, రాజేందర్ రావు, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సాయన్న, నర్సయ్య, గంగారాం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







