'అతడే' సినిమా ఆడియో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి
- June 11, 2018
హైదరాబాద్:నిమాను ప్రముఖ నిర్మాత వెంకటేష్ గాజుల తెలుగు ప్రేక్షకులకు 'అతడే' అనే టైటిల్‌తో అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధి అయిన రాజ్ కందుకూరి బిగ్ సీడీను మరియు ఆడియోను విడుదల చేసి మొదటి సీడీను డాక్టర్ గౌతమ్ కశ్యప్‌కి, నిర్మాత వెంకటేష్‌కు అందించారు.
ఈ సందర్బంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో 4 రకాల డిఫ్రెంట్ స్టోరీస్ కలసి ఉంటాయి. హీరో అన్ని షేడ్స్ లలోను బాగా నటించాడు. ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా చూస్తే డబ్బింగ్ సినిమా అనే ఫీల్ కలగదు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ను ఎంచుకొని తెలుగులో మనకు అందిస్తున్న వెంకటేష్‌కి ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
నిర్మాత వెంకటేష్ గాజుల మాట్లాడుతూ.. ''భాస్కరపట్ల, పూర్ణాచారిలు మంచి లిరిక్స్ అందించారు. గోవింద్ మీనన్, ప్రశాంత్ పిళ్ళై లు అందించిన మ్యూజిక్ అందరికి నచ్చుతుంది. ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను..'' అన్నారు.
మాటల రచయిత డాక్టర్ గౌతమ్ కశ్యప్ మాట్లాడుతూ.. ''మేము రాసిన లాస్ట్ సినిమా 'కుందనపు బొమ్మ' విజయం సాధించలేదు. డబ్బింగ్ సినిమాలకు మేము ఎప్పుడూ మాటలు రాయలేదు. మాకు ఆత్మసంతృప్తి చెందేలా కథ నచ్చడంతో ఈ సినిమాకు మాటలు రాశాము..'' అన్నారు.
లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడుతూ.. ''మాకు సింగర్స్ మంచి సహకారం అందించారు. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి మంచి చిత్రాన్ని అందిస్తున్న వెంకటేష్ గారికి అక్కడ విజయం సాధించినట్లే తెలుగులో కూడా మంచి విజయం సాధించి, ఇలాంటివి మరిన్ని చిత్రాలు ఆయన నిర్మించాలని కోరుకుంటున్నాము'' అన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!