సెల్‌ఫోన్ పేలింది.. కారు కాలి బూడిదయ్యింది
- June 11, 2018
పేరున్న కంపెనీ ఫోన్లు కూడా పేలుతున్నాయేంటని వినియోగదారుడు భయపడుతున్నాడు.. నిన్నగాక మొన్న ముంబైలో ఓ రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేస్తున్న వ్యక్తి జేబులో సెల్ పేలి అందర్నీ హడలుగొట్టేసింది. తాజాగా అమెరికాలోని మిచిగాన్‌లో ఓ మహిళ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే ఆమె దగ్గరున్న రెండు శాంసంగ్ ఫోన్లలో ఒకటి పేలి దాన్నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మహిళ కారు డోర్ తీసుకుని బయటపడి ప్రాణాలు కాపాడుకుంది. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించాయి. కళ్లముందే కారు కాలి బూడిదైంది. ఈ ఘటనపై ఫోన్ కంపెనీ తక్షణం స్పందించింది. ఫోన్ పేలడానికి గల కారణాలు విచారిస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..