అబుదాబీలో రేస్-3 షూటింగ్: హీరోయిన్ జాక్వెలైన్ కంటికి గాయం
- June 12, 2018
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఓ సినిమా షూటింగ్లో గాయపడింది. శ్రీలంకకి చెందిన జాక్వెలైన్ ఫెర్నాండెజ్, బాలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే. ఈ భామ 'రేస్-3' సినిమా షూటింగ్ కోసం అబుదాబీలో చక్కర్లు కొట్టింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె కంటికి గాయమయ్యింది. చిన్న గాయం కాదిది. ఈ గాయం కారణంగా ఆమె కంటి ఐరిస్ రూపం కోల్పోయింది. ఇది పర్మనెంట్ గాయమనీ, అయినాసరే, 'రేస్-3' సినిమాకి సంబంధించి ఇది ఒక గొప్ప మెమరీగా గుర్తుండిపోతుందని జాక్వెలైన్ వెల్లడించింది. 'రేస్-3' సినిమాని యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రెమో డిసౌజా డైరెక్టర్. సల్మాన్‌ఖాన్‌తో జాక్వెలైన్కి ఇది రెండో సినిమా.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..