విడుదల అయిన నా లవ్ స్టోరీ ఆడియో
- June 12, 2018
మహీధర్, సాక్షిసింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం నా లవ్‌స్టోరి. శివ గంగాధర్ దర్శకత్వంలో జి.లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. గీత రచయితలు శివశక్తిదత్త, భువనచంద్రలు ఆడియోని ఆవిష్కరించి.అతిథులుగా విచ్చేసిన ప్రవీణ్ సత్తారు, అనిల్ రావిపూడి, సి.ఉమామహేశ్వరరావులకు అందజేశారు. అలాగే అనిల్ రావిపూడి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదలచేశారు. అతిథులంతా ఆడియోతో పాటు చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు శివ గంగాధర్ మాట్లాడుతూ, ఈ సిని మాకు నాలుగు పిల్లర్స్‌గా తోటపల్లి మధు, హీరో మహీధర్, హీరోయిన్ సాక్షిసింగ్, హీరోయిన్ తం డ్రిగా నటించిన శివన్నారాయణ. ఈ నలుగురి మధ్యలో జరిగే కథే ఈ చిత్రం. గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో ఒక అందమైన ప్రేమకథను చెప్పాం అని అన్నారు.హీరో మహీధర్ మాట్లాడుతూ, దర్శకుడు కథ చెప్పినపుడే ఈ చిత్రం చేయాలన్న ఆసక్తి మొదలైంది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం అని అన్నారు. సంగీత దర్శకుడు వేదనివాన్ మాట్లాడుతూ, ఈ సంగీతం ఇంత బాగా రావడానికి మా టీమ్ కారణం అన్నారు. హీరోయిన్ సాక్షిసింగ్ కూడా మా ట్లాడారు
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..