షకీలా ప్లీజ్ ఛేంజ్ టైటిల్...
- June 13, 2018
నటి షకీలా చాలా సినిమాల్లో నటించింది. కొంత కాలం వెండి తెరకు దూరమైన ఆమె తన 250 వ చిత్రం 'శీలవతి' ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఏదేమైనా ఈ నెలలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని యూనిట్ భావించింది. అయితే సెన్సార్ సభ్యుల నుంచి సినిమా టైటిల్‌కు సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై షకీలా మాట్లాడుతూ.. సినిమా చూడకుండానే టైటిల్ మార్చమని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఈ పేరుతోనే ప్రమోషన్ కూడా చేసామని, ఈ పరిస్థితుల్లో టైటిల్ మార్చమని చెప్పడం భావ్యం కాదంటూ ఓ వీడియో మెసేజ్‌ని సెన్సార్ సభ్యులకు పోస్ట్ చేసింది. మరి దీనిపై వారు ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..