షకీలా ప్లీజ్ ఛేంజ్ టైటిల్...
- June 13, 2018నటి షకీలా చాలా సినిమాల్లో నటించింది. కొంత కాలం వెండి తెరకు దూరమైన ఆమె తన 250 వ చిత్రం 'శీలవతి' ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఏదేమైనా ఈ నెలలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని యూనిట్ భావించింది. అయితే సెన్సార్ సభ్యుల నుంచి సినిమా టైటిల్‌కు సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై షకీలా మాట్లాడుతూ.. సినిమా చూడకుండానే టైటిల్ మార్చమని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఈ పేరుతోనే ప్రమోషన్ కూడా చేసామని, ఈ పరిస్థితుల్లో టైటిల్ మార్చమని చెప్పడం భావ్యం కాదంటూ ఓ వీడియో మెసేజ్‌ని సెన్సార్ సభ్యులకు పోస్ట్ చేసింది. మరి దీనిపై వారు ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!