శంషాబాద్లో పేలిన రెడీమీ మొబైల్...
- June 13, 2018
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం. కానీ ఇప్పుడు ఆ స్థానాన్నిసెల్ ఫోన్ ఆక్రమించింది. స్మార్ట్ ఫోన్లతో అర చేతిలో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎవ్వరి చేతిలో చూసినా సెల్ ఫోనే కనిపిస్తోంది. అయితే వినియోగదారుల అజాగ్రత్తో.. లేదంటే తయారీలో లోపమో కానీ మొబైల్ ఫోన్లు పేలుతున్నాయి. శంషాబాద్లో ఓ యువకుడు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
చిట్టిబాబు ఇటీవల రెడీ మీ 4ఏ మోడల్ మొబైల్ కొనుగోలు చేశాడు. కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగింది. మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. దాన్ని నుంచి పొగలు రావడంతో అప్రమత్తమయ్యాడు. వెంటనే ఫోన్ ను కిందికి విసిరేశాడు. క్షణాల్లో సెల్ ఫోన్ పేలిపోయింది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చిట్టిబాబు సెల్ ఫోన్ పేలుడుపై రెడ్ మీ కంపెనీకి ఫిర్యాదు చేశాడు.
ఇటీవల దుబాయ్లో ను సెల్ ఫోన్ పేలింది. ఒకతను ప్యాంట్ జేబులో పవర్బ్యాంక్తో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అయితే అది హఠాత్తుగా భారీ శబ్దంతో పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి.. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓ షాపింగ్ మాల్లో ఈ ఘటన జరగడంతో.. అక్కడున్న వారందరూ భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడున్న సిబ్బంది మంటలు ఆర్పడంతో.. పెద్ద ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..