వాట్సాప్ స్కామ్‌పై వినియోగదారుల్ని హెచ్చరించిన ఒమన్‌టెల్
- June 13, 2018
మస్కట్:వాట్సాప్ ద్వారా స్కామర్స్ వినియోగదారుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఒమన్ టెల్ తన వినియోగదారుల్ని హెచ్చరించింది. ఒమన్ టెల్ నుంచి సర్వే పేరుతో లింక్‌ని వాట్సాప్ ద్వారా స్కామర్స్ పంపి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని ఒమన్ టెల్ పేర్కొంది. కొన్ని ప్రశ్నల్ని అడగడం, ఆ తర్వాత క్రెడిట్ కార్డు డిటెయిల్స్ సేకరించడం ద్వారా వినియోగదారుల్ని స్కామర్స్ నట్టేట్లో ముంచుతున్నట్లు ఒమన్ టెల్ తెలిపింది. ఒమన్ టెల్ నుంచి ఎవరూ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాక్ డిటెయిల్స్‌ని సేకరించబోరనీ, అలా ఎవరైనా ఒమన్ టెల్ పేరుతో స్కామ్‌లకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయనీ, వినియోగదారులు సైతం ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలని, ఖరీదైన బహుమతులు వస్తాయని మోసపోవద్దని ఒమన్ టెల్ సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..