'జీరో' టీజర్ రిలీజ్
- June 14, 2018
'జీరో' టీజర్ విడుదల ముంబయి: బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జీరో'. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షారుక్ మరుగుజ్జు పాత్రలోనటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శుక్రవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్‌ను షారుక్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ఈ టీజర్ అంత స్పెషల్ ఎందుకంటే.. ఇందులో షారుక్‌తో పాటు సల్మాన్ కూడా ఉన్నాడు. ట్రైలర్లో షారుక్ నడుచుకుంటూ వెళుతుంటే..'నేను ఇంతకాలం ఒంటరిగా ప్రయాణిస్తూ వచ్చాను. కానీ నా వెంట ప్రేక్షకులు కూడా వస్తూనే ఉన్నారు. నా కారవాన్ సైజు పెరుగుతూనే ఉంది. కానీ ప్రేక్షకులు ఒకరి కోసం ఎదురుచూస్తున్నారు. వారెవరో కాదు మన టైగర్ సల్మాన్ ఖాన్' అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. షారుక్ జనాల మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ వారంతా తన కోసమే ఎదురుచూస్తున్నారనుకుని పోజులివ్వడం నవ్వులు పూయిస్తోంది.
వెనక నుంచి సల్మాన్ వచ్చి..'ఏంటి భగవత్ సింగ్..నువ్వు ఇతరుల జీవితాలను మార్చేస్తావట' అని చెప్తున్నప్పుడు షారుక్ తల పైకెత్తి సల్మాన్‌ని చూస్తున్న తీరు ఫన్నీగా ఉంది. షారుక్, సల్మాన్ కలిసి స్టెప్పులేయడం, చివర్లో షారుక్.. సల్మాన్ చంకెక్కి ముద్దుపెట్టుకోవడం ఆకట్టుకుంటోంది. సల్మాన్ పక్కన షారుక్ చిన్నపిల్లాడిగా కన్పిస్తున్నారు.
'మా ఇద్దరి తరఫున యావత్ హిందుస్థాన్‌కు ఈద్ ముబారక్' అన్న డైలాగ్ బాగుంది. షారుక్‌పై అభిమానంతోనే ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నానని సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'నేను జీరో. అందుకే 'జీరో' చిత్రంలో నటించాను' అని సల్మాన్ చమత్కరించారు.
ఈ చిత్రంలో షారుక్‌కు జోడీగా కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..