సెల్ఫీ కావాలని దగ్గరగా వచ్చి..
- June 14, 2018
అందమైన అమ్మాయి కనిపిస్తే ఆకతాయిల చూపులన్నీ వారిపైనే.. మరి ఏకంగా హీరోయినే కనిపిస్తే.. ఎగిరి గంతేయరూ.. వారిని దగ్గరగా చూడాలని, వారితో మాట్లాడాలనీ.. వీలైతే ఓ ఆటోగ్రాఫ్.. కుదిరితే ఓ సెల్పీ అంటూ వెంటపడరూ.. నటి నుష్రత్ భరూచాకి కూడా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది. పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన నుష్రత్ దగ్గరకి ఓ అభిమాని వచ్చి ఒక్క సెల్ఫీ ప్లీజ్.. అని అడిగాడు. కాదనలేకపోయింది.. సరే అని రమ్మంటూ సైగ చేసింది. వచ్చినవాడు పద్దతిగా పక్కన నిలబడకుండా మరింత దగ్గరగా వచ్చి నడుము మీద చెయ్యి వేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన నుష్రత్ కోపం నషాళానికి అంటింది. వెంటనే అక్కడున్న మేనేజర్‌కి కంప్లైంట్ ఇచ్చింది. వారు వచ్చి ఆ యువకుడికి బుద్ది చెప్పి పంపించారు. పాపం నటీ నటులు ఇలాంటి చేదు అనుభవాలను ఎన్నింటినో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నట్టు తెలుగులో నటుడు శివాజీ సరసన 'తాజ్‌మహల్' చిత్రంలో నటించింది నుష్రత్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..