తాలిబన్ చీఫ్ హతం...
- June 15, 2018
అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడుల్లో... తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడుల్లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిచెందినట్టు అమెరికా మిలిటరీ ప్రకటించింది. కునార్ ప్రావిన్స్ ప్రాంతంలో కౌంటర్ టెర్రరిజం శాఖ నిర్వహించిన దాడుల్లో ముల్లా ఫజల్ చనిపోయాడని ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఓడోనిల్ వెల్లడించారు. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లో జూన్ 13వ తేదీన ఈ దాడులు జరిగాయి. అమెరికా, పాకిస్థాన్లో ముల్లా ఫజల్ అనేక దాడులకు సూత్రధారిగా వ్యవహరించినట్లు అమెరికా ప్రకటించింది. డిసెంబర్ 2014లో పెషావర్ ఆర్మీ స్కూల్లో జరిగిన భీకర దాడికి ముల్లానే సూత్రధారి. ఆ దాడిలో సుమారు 151 మంది ప్రాణాలు కోల్పోగా... వారిలో 130 మంది చిన్నారులే... ఇక 2012లో నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్జాహీపై హత్యకు కూడా అతనే కుట్ర పన్నాడు. ముల్లా తలపై 5 మిలియన్ల డాలర్ల నజరానా కూడా ఉంది. అయితే ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!