ఆగష్టు 3న విడుదల కానున్న 'గూఢచారి'
- June 15, 2018
టాలీవుడ్ లో ఈ మద్య కుర్ర హీరోల జోరు బాగా పెరిగిపోతుంది. 'దొంగాట', 'క్షణం', 'అమీతుమీ' లాంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అడివి శేష్. ఈ చిత్రం ఎక్కువ భాగం షూటింగ్ అమెరికా, హిమాచల్‌ప్రదేశ్, పుణే, న్యూఢిల్లీ, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో జరిగింది. షూటింగ్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది యూనిట్.
బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అత్యుత్తమ సాంకేతిక విలువలతో సినిమాను రూపొందించినట్లు నిర్మాతలు చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని వెల్లడించారు. శోభిత ధూలిపాళ్ల హీరోయిన్. ప్రకాష్‌రాజ్ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారా శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్స్ మర్చంట్ బ్యానర్లపై అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ తదితరులు నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చగా.. శనీల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!