హైదరాబాద్-కరీంనగర్ ప్యాసింజర్ రైలును ప్రారంభించిన పీయూష్ గోయల్
- June 15, 2018
హైదరాబాద్-కరీంనగర్.. ప్యాసింజర్ రైలు ప్రారంభం సికింద్రాబాద్: కాచిగూడ, కరీంనగర్ల మధ్య నడిచే కేసీజీ రైలు(57601)ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైలును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, కవిత, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయల్దేరి నిజామాబాద్, మోర్తాడ్, మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, లింగంపేట, జగిత్యాల, నూకపల్లి మల్యాల, పొద్దూరు, గంగాధర, కొత్తపల్లి మీదుగా కరీంనగర్‌కు మధ్యాహ్నం 3-25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అక్కణ్నుంచి మధ్యాహ్నం 3-45 గంటలకు బయల్దేరి.. కాచిగూడకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..