ఉల్లిపాయ పొట్టు తో ప్రయోజనాలు..
- June 15, 2018
ఉల్లిపాయ లేనిదే కూర అసాధ్యం. ప్రతి కూరలోనూ ఉల్లిపాయ ముక్క పడాల్సిందే. అందుకే ఉల్లిపాయలు అపుడపుడు కోయకుండానే కన్నీరు తెప్పిస్తుంటాయి. అంటే.. ఒక్కో సమయంలో వీటి ధరలు ఆకాశానికి కూడా తాకుతుంటాయి. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. వంటిట్లో ఉల్లిపాయకుండే ప్రాధాన్యత.
ఉల్లిపాయలను ఆరగించడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం ఉల్లిపాయలే కాదు సుమా... వాటిపై ఉండే పొట్టు వల్ల కూడా మనకు లాభాలు కలుగుతాయి. వాటిని తెలుసుకుంటే ఇక మీరు ఉల్లిపాయ పొట్టును అస్సలు పారేయరు. మరి ఉల్లిపాయ పొట్టు వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
* ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంతరం ఆ పాత్రను కిటికీలు లేదా గుమ్మం వద్ద పెడితే ఇంట్లోకి దోమలు, ఈగలు రావు. ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాసన వాటికి పడదు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
* ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టు తీసేసి ఆ నీటిని శరీరానికి పూసుకుంటే చర్మ సమస్యలు మటుమాయమైపోతాయి. అలాగే, నొప్పులు, వాపులు ఉన్నచోట రాసుకుంటే అవి క్రమంగా తగ్గిపోతాయి.
* తలస్నానం చేసేటప్పుడు జుట్టును నీటితో కడిగి షాంపూ పెట్టకముందే ఉల్లిపాయ పొట్టుతో బాగా మర్దనా చేయాలి. దీంతో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు, ఇతర సమస్యలు పోతాయి.
* ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తద్వారా అధిక బరువు తగ్గడమే కాదు, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
* ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. ఎందుకంటే ఆ సూప్ యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. అందుకే ఇన్ఫెక్షన్లు మాయమైపోతాయి. ఇలా అనేక ఉపయోగాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







