ఢిల్లీలో రాజకీయ వేడిని రగిలించిన ఏపీ సీఎం
- June 16, 2018
ఢిల్లీలో రాజకీయ వేడిని రగిలించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశం కోసం వెళ్లిన ఆయన.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, కేరళ సీఎం విజయన్‌తో భేటీ అయ్యారు. ఏపీ భవన్‌కు వచ్చిన ఈ ముగ్గురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు.. చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రశ్నించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎలా వ్యవహరించాలన్నది ప్రధానంగా చర్చిస్తున్నారు.
అటు రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పరామర్శించనున్నారు ముఖ్యమంత్రులు. ఆయన పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. కేజ్రీవాల్‌ను కలవడానికి ఇప్పటికే ఎల్జీ కార్యాలయం అనుమతిని కోరారు మమతా బెనర్జీ. అయితే... ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో.. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి.. ఆయన సతీమణిని కలిసి సానుభూతి వ్యక్తం చేయనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..