ఫిల్మ్ ఫేర్ తమిళ అవార్డ్స్..

- June 17, 2018 , by Maagulf
ఫిల్మ్ ఫేర్ తమిళ అవార్డ్స్..

65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం గత రాత్రి హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో వైభవంగా జరిగింది., తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమిళ సినీ విభాగంలో విక్రమ్ వేద చిత్రానికి పలు అవార్డలు లభించాయి.. ఇక ఉత్తమ నటుడు అవార్డు విక్రమ వేద నటనకు గాను విజయ్ సేతుపతి, ఆరమ్ చిత్రంలో ఉత్తమ నటనకు గానూ ఉత్తమనటి అవార్డు నయనతారలు స్వీకరించారు.. తమిళంలో అవార్డులు పొందిన వివరాలు.. ఉత్తమ చిత్రంగా అరమ్, ఉత్తమ దర్శకుడిగా పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద), ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి (విక్రమ్ వేద), ఉత్తమ నటిగా నయనతార (అరమ్), ఉత్తమ నటుడు (క్రిటిక్స్ చాయిస్)గా మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు), ఉత్తమ నటి (క్రిటిక్స్ చాయిస్) అదితి బాలన్ (ఆరువి), ఉత్తమ గేయ రచయితగా వైరముత్తు (కాట్రు వెలియిదయ్ వాన్) అవార్డులు తీసుకున్నారు. వీరితో పాటు ఉత్తమ సహాయ నటిగా నిత్యా మీనన్, ఉత్తమ సహాయ నటుడిగా ప్రసన్న, ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనిరుధ్ రవిచందర్, ఉత్తమ నేపథ్య గాయనిగా శశా తిరుపతి, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్), ఉత్తమ తొలి చిత్ర నటుడిగా వసంత్ రవి (తారామణి) అవార్డులు తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com