మలబద్దకం సమస్యకు చిట్కా...
- June 17, 2018
చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు మరుగుదొడ్డికి వెళ్లినా గంటల తరబడి అలానే కూర్చుండిపోతారు. ఈ సమస్య ఇటీవలి కాలంలో పెక్కుమందిలో ఎక్కువైపోయింది.
ఈ సమస్యతో బాధపడేవారికి రోజూ సరిగ్గా మలం బయటకు విసర్జన కాదు. ఈ కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో అవి ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇలాంటి వారు ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడాలంటే... అద్భుతమైన చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు.
ఆ టిప్ ఏంటంటే.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని పరగడుపున తాగేయండి. దీంతో పేగుల్లో ఉండే మలం, వ్యర్థాలు బయటికి వచ్చేస్తాయి. వెంటనే విరేచనం అవుతుంది. ఆ తర్వాత రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమం తాగితే చాలు, మలబద్దకం సమస్య జీవితంలో మళ్లీ ఎన్నటికీ ఉత్పన్నంకాదు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







