ఓ చిన్నచిత్తు కాగితమే.. సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసింది
- June 17, 2018
మొన్న కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు సెక్స్ రాకెట్.. వరుస వివాదాలతో టాలీవుడ్ షేక్ అవుతోంది. అమెరికాలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ తెలుగు తారలను హడలెత్తిస్తోంది. ఇన్ని రోజులు అమెరికాలో ఈవెంట్ అంటే.. ఎగిరి గంతేసే తారలు.. ఇప్పుడు ఆ దేశం పేరు చెబితేనే భయపడుతున్నారు. సెక్స్ రాకెట్ ఎపిసోడ్ తరువాత అక్కడి అధికారులు నిఘా పటిష్టం చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ అంటే చాలు.. సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్నా లేకున్నా.. గంటల కొద్ది కూర్చోబట్టి.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ఓ హీరోయిన్ ట్రావెల్ హిస్టరీపై అనుమానం వచ్చిన అక్కడి పోలీసులు ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. షూటింగుల కోసమే అక్కడకు వచ్చినట్లు తేలడంతో.. ఆమెను వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.
అసలింతకీ అమెరికాలో సెక్స్ రాకెట్ ఎలా బయటకు వచ్చిందో తెలిస్తే.. అందరూ షాక్ అవ్వకమానరు. ఓ చిత్తు కాగితమే.. సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసింది. సెక్స్ రాకెట్ సూత్రధారులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళను వీసా కేసులో ఈ ఏడాది జనవరి23న అరెస్ట్ చేశారు. 2016 ఆగస్టు8న వీసా గడువు ముగిసినా.. అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. నెలరోజుల తరువాత కిషన్, చంద్రకళ దంపతులు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే.. వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో.. ప్రముఖ హోటల్ మారియట్ పేరుతో ఉన్న పేపర్ పోలీసుల దృష్టిని ఆకర్షించింది. దానిపై ఒకచోట వాషింగ్టన్ డీసీ, దాని పక్కనే సినీ హీరోయిన్ల పేర్లు, రూమ్ నంబర్లు చేతి రాతతో ఉంది. ఇలా చాలా మంది పేర్లు.. గదుల నంబర్లు ఉండటంతో.. వ్యభిచార ముఠాగా పోలీసులు అనుమానించారు. ఫిబ్రవరి 16న కిషన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా కండోమ్స్, 5డైరీలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో లభ్యమైన వివరాల ఆధారంగా.. పలువురు నటీమణులను పోలీసులు విచారించారు. ఆరుగురు వ్యభిచారానికి పాల్పడినట్లు గుర్తించారు.
కిషన్ దంపతుల ఇంట్లో దొరికిన ఆధారాలతో... ఆరుగురు హీరోయిన్లు వ్యభిచారంలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. కాల్‌డేటా డేటా విశ్లేషిస్తున్న పోలీసులు.. మరింత మంది బాధితుల పేర్లు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు, విటులను అధికారులు విచారించారు. వారందరూ అప్రూవర్లు మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో.. చార్జిషీటులో వారిని సాక్షులుగా పేర్కొనే అవకాశం ఉంది. గురువారం జరిగే విచారణలో దీనిపై క్లారిటీ రానుంది.
సెక్స్ రాకెట్ సూత్రధారులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళ భవితవ్యం ఈనెల 21న తేలనుంది. అనేక తెలుగు సంఘాలపేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. సినీ తారలను అమెరికా రప్పించి వ్యభిచారం చేయించినట్లు అధికారులు గుర్తించారు. మోదుగుమూడి దంపతుల ఇంటరాగేషన్ తర్వాత.. అధికారులు 42పేజీల క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ కేసు గురువారం విచారణకు రానుంది. వీసా గడువు ముగిసిన తరువాత కూడా అమెరికాలో ఉన్న నేరంపై అరెస్టైన కిషన్ దంపతులను ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. వీసా అంశంతో పాటు వ్యభిచారంపై కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు లభించడంతో పాటు.. విటులు, టాలీవుడ్ హీరోయిన్లు అప్రూవర్లుగా మారడంతో.. నెలరోజుల్లోనే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కోర్టు కిషన్, చంద్రకళకు విధించే శిక్ష పూర్తైన తరువాత.. ఇద్దరిని దేశం నుంచి పంపించి వేస్తారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా