యు.ఏ.ఈ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 18, 2018
యు.ఏ.ఈ:4వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దుబాయ్‌లో జూన్ 21న జబీల్ పార్క్ ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఈ వెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు నౌఫ్ మర్వాయి. సౌదీ అరేబియాకి చెందిన తొలి యోగా గురువు అయినా నౌఫ్ మార్వాని, భారత ప్రభుత్వం ద్వారా పద్మ శ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. యోగా డెమోనిస్ట్రేషన్‌ని ఆయన స్వయంగా పర్యవేక్షించనుండగా, పలు స్కూల్స్‌కి చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఈవెంట్స్, పోటీలు కూడా జరగనున్నాయి. నార్తరన్ ఎమిరేట్స్‌కి సంబంధించి పలు ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్ అల్ కువైన్‌లోని అల్ అరాబి స్పోర్ట్స్ క్లబ్‌లో జూన్ 20న సాయంత్రం 6.30 నిమిషాలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది. అజ్మన్‌లోని ఇండియన్ అసోసియేషన్ ప్రిమైసిస్‌లో జూన్ 21న సాయంత్రం 7 గంటలకు, షార్జాలోని ఎక్స్‌పో సెంటర్‌లో జూన్ 22న సాయంత్రం 4 గంటలకు, ఫుజైరాలో మీడియా పార్క్ కన్వెన్షన్ సెంటర్‌లో జూన్ 22న 6.30 నిమిషాలకు, రస్ అల్ ఖైమాలో జూన్ 22న అమెరికన్ యూనివర్సిటీలో 7 గంటలకు ఈ ఈవెంట్ జరుగుతుంది. యోగా పట్ల ఆసక్తి వున్నవారంతా దుబాయ్‌లోని మెయిన్ ప్రోగ్రామ్‌తోపాటు, ఇతర ఎమిరేట్స్‌లో నిర్వహించే ఈవెంట్స్‌లోనూ పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్స్‌లోకి ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!