బహ్రెయిన్‌ సమ్మర్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

- June 18, 2018 , by Maagulf
బహ్రెయిన్‌ సమ్మర్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

బహ్రెయిన్‌ అథారిటీ ఫర్‌ కల్చర్‌ అండ్‌ యాంటిక్స్‌ (బిఎసిఎ), ఈ ఏడాది బహ్రెయిన్‌ సమ్మర్‌ ఫెస్టివల్‌ని ప్రారంభించనుంది. ఆగస్ట్‌ 18 వరకు ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది. 'ముహర్రాక్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కల్చర్‌' పేరుతో ఈ ఈవెంట్‌ జరగనుంది. 10వ ఎడిషన్‌ బహ్రెయిన్‌ సమ్మర్‌ ఫెస్టివల్‌, రెండు నెలలపాటు అంగరంగ వైభవంగా సందర్శకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యింది. మల్టీ కల్చరల్‌, ఫ్యామిలీ అండ్‌ క్రియేటివ్‌ వర్క్‌ షాప్స్‌కి ఈ ఈవెంట్‌ వేదిక కానుంది. చారిత్రక అరద్‌ ఫోర్ట్‌ వద్ద నఖూల్‌ టెంట్‌లో ఈ ఈవెంట్‌ జరుగుతుంది. చిల్డ్రన్‌ యాక్టివిటీస్‌, వర్క్‌ షాప్స్‌ ఇక్కడ ఇతర ప్రధాన ఆకర్షణలు. నఖూల్‌, నఖూలా ప్రతిరోజూ సాయంం 7 గంటల నుంచి 9 గంటల వరకు (ఆదివారం మినహా) సందర్శకులకు ఆకర్షణ పలుకుతున్నాయి ఈ ఈవెంట్‌ కోసం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com