హుదయిదాపై సౌదీ-ఎమిరేట్స్ సైనిక చర్య
- June 18, 2018
యెమెన్‌లోని హుదయిదా పట్టణంపై సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేపట్టిన సైనిక చర్యపై ఐరాస మానవ హక్కుల మండలి చీఫ్ జీడ్ రాడ్ అల్ హుస్సేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హుదయిదా రేవు పట్టణంలో హౌతీ తిరుగుబాటుదారులపై బాంబుల వర్షం కురిపించిన ఈ సైనిక చర్య లక్షలాది మంది ప్రజలను ప్రమాదంలో పడేస్తోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుదయిదా పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులపై తాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నానని, ఈ దాడులు అక్కడి పౌరుల జీవితాలను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న 'జాతీయ వాద ఉన్మాదపు ముప్పు'ను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నాడు సౌదీ-ఎమిరేట్స్ సంకీర్ణ సేనలకు చెందిన హెలీకాప్టర్లు హౌతీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించటంతో అనేక మంది సాధారణ పౌరులు గాయపడ్డారని స్థానికులు చెప్పారు. హుదయిదా పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సౌదీ-ఎమిరేట్స్ సంకీర్ణ సేనల మద్దతుతో యెమెన్ ప్రభుత్వ సేనలు ఆరు రోజుల క్రితం పోరాటం ప్రారంభించిన విషయం తెలిసిందే.
సహకరిస్తున్నట్లు కాంగ్ చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి పునరుద్ధరణలో చైనా కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం వుందని, ఇందుకు ఆ దేశ విస్తృత సహకారాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







