విడుదల ఆయన సుమంత్ 'ఇదం జగత్' టీజర్

- June 18, 2018 , by Maagulf
విడుదల ఆయన సుమంత్ 'ఇదం జగత్' టీజర్

'మళ్లీ రావా' తో యావరేజ్ హిట్ అందుకున్న హీరో సుమంత్ తాజాగా 'ఇదం జగత్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తుంది. సుమంత్ నెగిటివ్ షెడ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తీ చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులు, సినీ వర్గాల నుండి మంచి స్పందన లభించగా తాజాగాజూన్ నెలాఖరుకు ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అలాగే సినిమా జూలై ఆఖరులో ప్రేక్షకుల ముందుకొస్తుందని సమాచారం. కొత్త తరహా కథ కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం తనకు మంచి విజయాన్ని అందిస్తుందని సుమంత్ గట్టి నమ్మకంతో ఉన్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న చిత్రాన్ని శ్రీ విగ్నేష్ కార్తిక్ సినిమాస్ పతాకంపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com