శ్రీనగర్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
- June 20, 2018
జమ్మూ:రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూంఛ్ సెక్టార్‌లోని మెందార్‌లో పర్యటించారు. ఇటీవలే ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జవాన్ ఔరంగజేబ్ కుటుంబాన్ని పరామర్శించారు. నిర్మలా సీతారామన్‌కు రక్షణగా.. పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. ఉగ్రదాడులకు ఆస్కారం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఔరంగజేబ్ నివాసం దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నిర్మల వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. జూన్ 14న జవాను ఔరంగజేబ్‌ను ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. ఆ తర్వత ఔరంగజేబ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు వారి ఆక్రోషాన్ని ప్రపంచానికి తెలిపాయి. తన కుమారున్ని చంపిన వారిని 24 గంటల్లో చంపేయాలని భారత ఆర్మీని కోరాడు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పరామర్శ ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా