రస్‌ అల్‌ ఖైమాలోని ఓ ఇంట్లో పాము

- June 20, 2018 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమాలోని ఓ ఇంట్లో పాము

రస్‌ అల్‌ ఖైమాలోని జుల్పూర్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో పాము కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రస్‌ అల్‌ ఖైమా సివిల్‌ డిఫెన్స్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంట్లోవారిని బయటకు పంపిన సివిల్‌ డిఫెన్స్‌ టీమ్‌, ఎట్టకేలకు పాముని గుర్తించి, దాన్ని చంపేయడం జరిగింది. కొండలు, ఎడారులకు దగ్గరగా వున్న ప్రాంతాల్లోనివారు అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి ఘటనల గురించి తెలిస్తే వెంటనే సివిల్‌ డిఫెన్స్‌కి సమాచారం అందించాలని అధికారులు పేర్కొన్నారు. అయితే చంపబడ్డ పాము విషపూరితమా? కాదా? అన్నదానిపై స్పష్టత లేదు. యూఏఈలో స్కార్పియన్స్‌, స్నేక్స్‌, స్పైడర్స్‌ ఎక్కువగా కన్పిస్తాయి. రస్‌ అల్‌ ఖైమా మౌంటెయిన్స్‌లో ఓ వ్యక్తి మార్చి నెలలో పాముకాటుకి గురికాగా, వెంటనే అతన్ని ఎయిర్‌ లిఫ్ట్‌ చేశారు. యూఏఈ సౌత్‌ ఈస్టర్న్‌ పార్ట్‌ ప్రాంతంలో మొత్తం ఏడు విషపూరితమైన ఆరెంజ్‌ అరేబియన్‌ క్యాట్‌ స్నేక్స్‌ని గుర్తించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com