పారిస్:ట్రైన్‌లో పుట్టాడు.. అదృష్టం పట్టేశాడు

- June 20, 2018 , by Maagulf
పారిస్:ట్రైన్‌లో పుట్టాడు.. అదృష్టం పట్టేశాడు

పారిస్:ఇక్కడా, అక్కడా పుడితే అదృష్టం వరించదండీ.. ప్యారిస్‌లో.. అది కూడా అక్కడి ట్రైన్‌లో పుడితేనే 25 ఏళ్లవరకు ఉచితంగా రైలు ప్రయాణం చేయవచ్చు. ఇది అందరికీ వర్తిస్తుందో లేదో తెలియదు కానీ ఓ బుజ్జాయికి మాత్రం ఇది వర్తింపజేసారు రైలు అధికారులు. అనుకున్న సమయాని రైలు రాలేదు. ఆలస్యంగా వచ్చింది. దాంతో రైలెక్కి ఆసుపత్రికి వెళ్లాలనుకున్న ఓ మహిళ ఆలస్యంగా వచ్చిన రైలెక్కి పురుటి నొప్పులతో ఇబ్బంది పడుతోంది. పక్కనే ఉన్న మిగిలిన ప్రయాణీకులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది వెంటనే స్పందించి ఓ స్టేషన్‌లో రైలుని ఆపేశారు. 15 మంది ప్రయాణీకులు రైల్వే సిబ్బంది సహాయంతో ఆమెకు డెలివరీ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెకు రైల్వే అధికారులు అభినందనలు తెలియజేసారు. సుఖ ప్రసవం జరగడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ శుభసందర్భంలో ఆమెకు ఓ బహుమతి కూడా ఇచ్చారు. బాబుకి 25 ఏళ్లు వచ్చే వరకు రైల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పారిస్ మెట్రో ప్రకటించింది. రైల్లో ప్రయాణించేటప్పుడు గర్భిణులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సిబ్బంది అప్రమత్తమైన విషయాన్ని అన్ని స్టేషన్లలో డిస్‌ప్లే చేయించారు రైల్వే అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com